Tuesday, October 8, 2024

TS | సీయూఈటీ పరీక్షకు 4.62 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశంలోని సెంట్రల్‌ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ యూనివర్శిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) పీజీ-2024 ప్రవేశ పరీక్షకు ఈ సారి రికార్డు స్థాయిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 2,47,990 మంది మహిళలు, 2,14,587 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 11 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 324 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు మూడు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. ఫలితాలను ఏప్రిల్‌లో ప్రకటించే అవకాశం ఉంది. దరఖాస్తుకు గడువు ఫిబ్రవరి 10తో ముగిసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement