Monday, April 22, 2024

WPL | గుజరాత్ పై గెలుపు..ఆర్సీబీ ఖాతాలో మరో విజయం

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఆర్సీబీ విజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. గుజరాత్ ను చిత్తుగా ఓడించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 108 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలో ఛేదించిన ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కెప్టెన్ స్మృతి మంధాన (43) అద్భుతంగా ఆడగా.. సబ్బినేని మేఘన (36), ఎల్లిస్ పెర్రీ (23) పరుగులతో ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్, తనూజా కన్వర్ చరో వికెట్ దక్కించుకున్నారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టార్గెట్ సెట్ చేయడంలో మరోసారి విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. 31 పరుగులతో హేమలత ఆ జట్టు టాప్‌ స్కోరర్‌ కాగా స్టార్‌ బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (2), సోఫి మోలినెక్స్‌ (3)లు రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement