Sunday, April 28, 2024

TS | మార్చి 1 నుంచి లాసెట్‌ దరఖాస్తులు.. జూన్‌ 3న రాత పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మూడు, ఐదేళ్ల లా కోర్సులతోపాటు పీజీ లా(ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌లకు మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 15గా నిర్ణయించారు. టీఎస్‌ లాసెట్‌ దరఖాస్తు రుసుం రూ.900. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు. టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ దరఖాస్తు రుసుం రూ.1100. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.900గా నిర్ణయించారు.

రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 25వ తేదీ లోపు, రూ.1000 ఆలస్య రుసుంతో మే 5వ తేదీ లోపు, రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 15 లోపు, రూ.4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ రాతపరీక్షలను జూన్‌ 3వ తేదీన కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించనున్నారు. మూడేళ్ల కోర్సులో చేరేవారికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఐదేళ్లు, పీజీఎల్‌సెట్‌ రాతపరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక కీని జూన్‌ 6న విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement