Tuesday, May 7, 2024

వీఆర్ఏల స‌ర్దుబాటు కోసం కొత్తగా 14,954 పోస్ట్ లు మంజూరు

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని వీఆర్ఏల స‌ర్దుబాటు కోసం కేసీఆర్ స‌ర్కార్ మార్గం సుగ‌మం చేసింది. వివిధ శాఖ‌ల్లో కొత్త‌గా 14,954 పోస్టులు మంజూరు చేసింది ప్ర‌భుత్వం. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది. రెవెన్యూ శాఖ‌లో 2,451 జూనియ‌ర్ అసిస్టెంట్, పుర‌పాల‌క శాఖ‌లో 1,266 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు, రెవెన్యూ శాఖ‌లో 679 స‌బార్డినేట్ పోస్టులు, నీటిపారుద‌ల శాఖ‌లో 5063 ల‌ష్క‌ర్, హెల్ప‌ర్ పోస్టులు, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల‌ను కొత్త‌గా సృష్టించింది. ఈ పోస్టలలో విఆర్ఎలను వారి వారి విద్యార్హతల ఆధారంగా భర్తీ చేస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement