Monday, April 29, 2024

మా పిల్లి తప్పిపోయింది, ఎక్కడైనా కనిపించిందా… మంచిర్యాలలో పోస్టర్లు!

మా పిల్లి తప్పిపోయింది. మీకెక్కడైనా కనిపించిందా అన్న పోస్టర్లు మంచిర్యాల పట్టణంలో హాట్​ టాపిక్​ అయ్యాయి. మంచిర్యాల పట్టణంలో పిల్లికి సంబంధించిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ ఓ కుటుంబం ఆ పోస్టర్లు వేసింది. మంచిర్యాల పట్టణానికి చెందిన పర్వేజ్ కుటుంబం ఓ పిల్లిని పెంచుకుంటోంది. నాలుగేళ్లుగా ఆ పిల్లి పర్వేజ్ కుటుంబంలో భాగమైపోయింది. పిల్లి పేరు ఫ్లుష్పీ. ఉన్నట్టుండి అది కాస్త ఎటో వెళ్లిపోయింది. 4 నెలలుగా ఆ పిల్లి కోసం పర్వేజ్ కుటుంబం వెతకని చోటంటూ లేదు. తమ పిల్లిని వెతికి తెచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తామని కూడా వారు పోస్టర్లలో ముద్రించి, పట్టణంలోని పలు ప్రాంతాల్లో అతికించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement