Monday, May 6, 2024

20 చానల్స్ పై నిషేధం విధించిన యూట్యూబ్‌

20 చాన‌ళ్లు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయ‌ని గూగుల్‌ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ యూట్యూబ్‌ నిషేధించింది. ఈ విష‌యాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు యూట్యూబ్‌ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకోగా.. వీటితో పాటు రెండు వెబ్‌సైట్లను సైతం నిషేధించారు. ఈ చానల్స్‌, వెబ్‌సైట్‌ కార్యకలాపాలు పాక్‌ నుంచి కొనసాగుతున్నాయి. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, టెలీకాం శాఖ అధికారుల ప్రకారం.. యూట్యూబ్‌ చానల్స్‌, వెబ్‌సైట్లు పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ చానల్స్‌లో ‘నయా పాకిస్తాన్‌’ పేరుతో ఒకటి ఉందని, ఇందులో రెండు మిలియన్ల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement