Monday, May 6, 2024

యువకుడి దారుణ హత్య.. మొండం నుండి తల వేరుచేసిన దుండ‌గులు..

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్) : మాయమౌతున్నడమ్మ మనిషన్న వాడు అని గీతాలాపన చేసిన అందెశ్రీ పాటకు అనుగుణంగా యాంత్రిక జీవితంలో మనిషి తోటి మనిషినే అతి కిరాతకంగా చంపేస్తున్నాడు. చిన్న చిన్న గొడవలకు కూడా ప్రాణాలు తీసేస్తున్నారు. అతి క్రూరంగా ప్రవర్తిస్తూ సొంత లాభమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సంగారెడ్డి పరిధి ఇంద్రకరణ్ లో జరిగిన అతి క్రూర హత్యే నిదర్శనం. 32 గంటల భూమి కోసం ఓ నిండు ప్రాణాన్ని కడతేర్చి పాశవిక ఆనందం పొందిన తీరు ఆలోచింపజేస్తుంది. తల, మోండం ను వేరు చేసి రాజు నాయక్ అనే యువకున్ని ప్రత్యర్ధులు అతి క్రూరంగా హత్య చేశారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తల, మొందం లను వేరు చేసినా పాపం పండి పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

మూడు పోలీసు స్టేషన్ ల పరిధిలో ఘటన జరగడం గమనార్హం. కాగా కేసును పఠాన్ చేరు డిఎస్పీ భీరెడ్డి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు జిల్లా ఎస్పీ రమణ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి నిందితులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రాజు నాయక్ తండ్రి కూడా ఇదే విధంగా ప్రత్యర్థుల చేతిలో 1990 లో భుదేరా సమీపంలో హత్యకు గురికాగా రాజు సైతం హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని కొలుకోకుండా చేసింది..

అతి కిరాతకంగా హత్య
కేవలం 32 గంటల భూమి కోసం రాజు నాయక్(32) అనే వ్యక్తిని రాం సింగ్ నాయక్ గ్యాంగ్ హతమార్చడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. మృతుడు మండల టీఆర్ఎస్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న Bdl భానుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ సభ్యులు రాజు నాయక్ కనబడటం లేదు అని పిర్యాదు చేయగా ఈ నెల 27న భానుర్ పి ఎస్ లో కేసు నమోదు చేశారు. అప్పటి నుండి రాజు నాయక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం రాయ్ కోడ్ పి ఎస్ పరిధి కూస్నుర్ గ్రామ పరిధిలో

రాజు తల లభించగా పోలీసులు సమీప ప్రాంతాలను మొండెం కోసం గాలించారు. తలను బట్టి భానుర్ లో మిస్సింగ్ కేసు నమోదైన రాజు నాయక్ ది గా తేల్చారు. మొండెం కోసం గాలిస్తుండగ న్యాల్కల్ మండలం రఘవపుర్ శివారు లోని మంజీరా బ్రిడ్జి కింద రాజు నాయక్ మొండెం దొరికింది. విచారణ చేపట్టిన పోలీసులకు హత్య ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిసింది. ఓ పోలీసు స్టేషన్ పరిధిలో హత్య జరుగగా రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన రాజు నాయక్ తల, మొండెం లభించడంతో కేసు నమోదైన. Bdl భానుర్ లిమిస్ట్స్ డిఎస్పీ భీమ్ రెడ్డికి కేసు ఇన్వెస్టిగేషన్ ను ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రస్తుతం రాజ్ నాయక్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో నిందితులు
హత్య చేసి తప్పించుకుందామనుకున్న రాం సింగ్ నాయక్ గ్యాంగ్ పోలీసు విచారణలో పట్టుబడ్డారు. రామ్ సింగ్ తో పాటు మొత్తం 7 గురు నిందుతులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల్లో గోపాల్ నాయక్, మహేష్, బాలు, మల్లేష్ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. కేసును డిఎస్పీ భీమ్ రెడ్డి దర్యాప్తు చేస్తుండగా వివరాలు రేపు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా హత్యకు గు రాజుకు ముగ్గురు సంతానం ఉన్నారు.

- Advertisement -

రేపు ప్రెస్ మీట్
రేపు జిల్లా ఎస్పీ రమణకుమారు హత్యకు గురైన రాజు ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి నిందితులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడు రాజు నాయక్ స్వస్థలం వెలిమల తండా. రాజు నాయక్ మండల టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రాజ్ నాయక్ మాదిరి ఆయన తండ్రిని కూడా ప్రత్యర్ధులు 1990 లో భుదేరా శివారులో హత్యచేసిన తెలిసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు హత్యకు గురికావడం తో మృతుడి కుటుంబం శోకసముద్రంలో మునిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement