Wednesday, May 1, 2024

ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా?

ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిశాక పన్ను చెల్లించేందుకు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలి. 2020-21 అసెస్మెంట్ ఇయర్ కోసం ఐటీఆర్ ను 2021 మార్చి 31లోపు దాఖలు చేయాల్సి ఉంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ హెచ్చరిస్తోంది. దీన్ని ఖాతరు చేయని వాళ్లు ఆదాయపు పన్ను చట్టం-1961లోని నిబంధన 199(1) ప్రకారం అదనపు వడ్డీ, రుసుములు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే, మార్చి 31 నాటికి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రిటర్నులు సమర్పించకపోతే సంబంధిత వ్యక్తులను టైమ్ బార్డ్ చెల్లింపుదారుడిగా పరిగణిస్తారని ఆర్ఎస్ఎం వ్యవస్థాపకులు డాక్టర్ సురేశ్ సురానా తెలిపారు. టైమ్ బార్డ్ రిటర్నులను ఎలాంటి నిబంధనలు అనుమతించవని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుదారుడికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉండి రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైతే అతడికి 50 శాతం పన్నుకు సమానమైన జరిమానా విధిస్తారని ఆయన పేర్కొన్నారు. సెక్షన్ 270ఏ కింద ఫైన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులను సెక్షన్ 276సీసీ కింద ప్రాసిక్యూషన్ చేసే అవకాశముందన్నారు.

డిఫాల్ట్ పన్ను చెల్లింపుదారుడు 3 నెలల కంటే తక్కువ సమయం లేకపోయినా కఠినమైన జైలు శిక్షకు గురవుతారన్నారు. అయితే, దీన్ని రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. పన్ను ఎగవేత 25 లక్షల కంటే ఎక్కువ ఉండి రిటర్నులు దాఖలు చేయకపోతే వారికి 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుంది. 10 వేల లోపు రిటర్నులకు సంబంధించి ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదని సురేశ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement