Thursday, May 2, 2024

Railways: యాత్రికోం కృప‌యా ధ్యాన్‌దే.. ఈ రూట్ల‌లో రైళ్లు తాత్కాలికంగా బంద్!

ప్రయాణికులకు కీలక అలర్ట్ వెలువ‌రించింది రైల్వే సంస్థ‌. పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇవ్వాల (శుక్ర‌వారం) ప్రకటించింది. దీనికి కార‌ణంగా ఆయా మార్గాల్లో పనులు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మేరకు ఏఏ రూట్ల‌లో రైళ్లు ర‌ద్దు అవుతున్నాయ‌నే వివరాలను వెల్లడించింది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రేపల్లె, తెనాలి, గూడూరు, మధిర నగరాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసిన‌ట్టు తెలిపింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.

విజయవాడ – గూడూరు (07500) రైలు, గూడూరు – విజయవాడ (07458), సికింద్రాబాద్ – మధిర (17202), మధిర – సికింద్రాబాద్ 17201 రైళ్లను 11, 12 తేదీల్లో రద్దు చేశారు.

కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం మధ్య నడిచే 17267 రైలు, విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ మధ్య రాకపోకలు సాగించే 17268, కాకినాడ పోర్ట్ – విజయవాడ, విజయవాడ – కాకినాడ పోర్ట్ 17257 రైలు కూడా 10, 11 తేదీల్లో రద్దైంది.

విజయవాడ – గుంటూరు రైలు, గుంటూరు – రేపల్లె 07786 రైలు, రేపల్లె – తెనాలి 07873, తెనాలి – గుంటూరు 07282, గుంటూరు – విజయవాడ 07864, విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465 రైళ్లు కూడా 10, 11 తేదీల్లో రద్దయ్యాయి.

- Advertisement -

కాగా, సికింద్రాబాద్ – మధిర‌ మధ్య నడిచే 17202, మధిర – సికింద్రాబాద్ (17201) మధ్య నడిచే రైళ్లను 11, 12వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు వీటిని గమనించి రాకపోకలను కొనసాగించాలని కోరారు అధికారులు.

విశాఖపట్నం – మహబూబ్ నగర్ మధ్య నడిచే రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్నవరం రైల్వే స్టేషన్ ను కూడా రైలు ఆగే జాబితాలో చేర్చారు. ప్రయాణికులు అన్నవరంలో కూడా ఎక్కవచ్చిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement