Friday, April 19, 2024

రొటీన్‌కు బిన్నంగా “థ్యాంక్ గాడ్”.. ట్రైల‌ర్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేసిన మేక‌ర్స్

ఇప్పటి వరకు ల‌వ్, యాక్షన్, కామెడీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌ల చుట్టూ తిరిగే సినిమాలు చూశాం. కానీ ఈసారి బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా ‘థ్యాంక్ గాడ్’ చిత్రంతో పూర్తి విభిన్నమైన కథను తెర‌పై చూపించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోష‌న్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్.

నిన్న (గురువారం) సినిమాలోని యాక్ట‌ర్ల ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు.. కాగా ఇవ్వాల (శుక్ర‌వారం) కొద్ది సేప‌టి క్రితం సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.. ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు మేక‌ర్స్.. ఈ మూవీ దీపావళి పండుగకు అంటే అక్టోబర్ 25వ తేదీన‌ థియేట‌ర్ల‌లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ మల్హోత్రా కూడా వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో ట్రైలర్‌ను షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement