Monday, April 29, 2024

కేజీఎఫ్2 నుంచి – లిరిక‌ల్ సాంగ్

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్2 తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ చిత్రంతో సౌత్ స్టార్ హీరో అయ్యాడు య‌ష్. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా సినీ జనాలను ఎదురుచూసేలా చేశారు. కేజీఎఫ్‌ 2 సినిమా కూడా.. షూటింగ్‌ పూర్తి చేసుకుని… విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాలో మదర్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఎదగరా.. ఎదగరా అనే లిరిక్స్‌ తో.. ప్రారంభం అయ్యే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్‌ 1 లోని బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజికే ఈ పాటకు జోడించడంతో.. అందరి మనసులు దోచుకుంటోంది. కాగా.. కేజీఎఫ్‌ 2 సినిమా ఏప్రిల్‌ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement