Monday, April 29, 2024

యాదాద్రి లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవాల‌య భ‌ద్ర‌త‌కి – రూ.15కోట్ల ప్ర‌తిపాద‌న‌

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవాలయం భ‌ద్ర‌తా ప్ర‌తిపాద‌న‌లో భాగంగా రాచ‌కొండ పోలీసులు కొండ‌పై ..కొత్త పోలీస్ స్టేష‌న్, యాంటీ టెర్ర‌ర్ యూనిట్ ఆక్టోప‌స్ క‌మాండోల‌ను సిఫార్సు చేసింది. ఈ భ‌ద్ర‌త‌కి రూ.15కోట్లు ఖ‌ర్చు అవుతాయ‌ని అంచ‌నా. దాదాపు 15 రోజుల క్రితం రాచకొండ పోలీసులు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పరిధిలోని వీవీఐపీ కాటేజీలు, ఇతర ప్రాంగణాలతో పాటు ఆలయంలో సెక్యూరిటీ ఆడిట్ చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ , ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపించారు.పోలీసులు భద్రతా ప్రణాళికను ప్రతిపాదించారు. కాగా.. దీని అమలుకు దాదాపు 15 కోట్లు ఖర్చవుతుందని తేలడం గమనార్హం.

భద్రతా అంశాలలో డ్రోన్‌లను కొనుగోలు చేయడం, భక్త ప్రవాహం, వాహనాలను నిర్వహించడం, క్యూ నిర్వహణ, చేతితో పట్టుకునే మెటల్ డిటెక్టర్‌ల కొనుగోలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ రికగ్నిషన్ టెక్నాలజీ, బ్యాగేజీ చెకింగ్, ఇతర అంశాలు ఉన్నాయి. కాగా ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు..భద్రతా ఏర్పాట్లు ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి ,ప్రతిపాదనలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం యాగశాలలో మైదానం,పనుల గుర్తింపు వంటి కొన్ని అంశాలు పూర్తి చేయాల్సి ఉంది, ఆపై మేం భద్రతా బ్లూప్రింట్‌ను ఖరారు చేయవచ్చ‌ని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement