Thursday, May 2, 2024

కరోనా వుహాన్ ల్యాబ్‌లో అనుకోకుండా పుట్టి ఉండొచ్చట..

మహమ్మారి కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ పుట్టిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం.  అయితే, ల్యాబ్‌లో అనుకోకుండా ఇది పుట్టి ఉండొచ్చన్న వాదనను కూడా కొట్టిపడేయలేమని చెప్పడం గమనార్హం. అయితే, ల్యాబ్ నుంచే అది లీకైందని చెప్పే ఆధారాలు కూడా లేవన్నారు. సార్స్-కోవ్-2 వైరస్ జంతువుల నుంచి మనుషుల్లో ప్రవేశించిందన్న వాదనకు బలం చేకూర్చే కొన్ని శాస్త్రీయ అధారాలు మాత్రం ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీ, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ, చైనాలోని జియావోటాంగ్-లివర్‌పూర్ యూనివర్సిటీలతో కలసి ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, పరిశోధక సంస్థలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు కరోనాపై ఇప్పటి వరకు లభించిన శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి జ్వర సర్వే

Advertisement

తాజా వార్తలు

Advertisement