Thursday, April 25, 2024

ప్రచంచ కుబేరుడు అదానీ

ప్రపంచంలో కుబేరులంటే భారతీయుల పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. రోజు రోజుకు తన ఆదాయాన్ని పెంచుకొని ప్రపంచ ధనవంతులను వెనక్కి నెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత పారిశ్రామిక వేత్తగా పేరొందిన గౌతమ్‌ అదానీ అస్తుల పెరుగుదల వేగం ప్రపంచంలోనే అత్యధికంగా వుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్‌, పవర్‌ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి.

తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం అదానీ ఆస్తుల నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదానీకి గ్రూప్స్‌కు చెందిన ఎనర్జీ, పవర్, ట్రాన్స్మిషన్, ఎంటర్ ప్రైజెస్, గ్యాస్, పోర్ట్స్ తదితర రంగాల్లో సంపద ఈ ఏడాది 90 శాతం పెరిగింది.

మరోవైపు ఆసియాలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ 8.1 బిలియన్ డాలర్లు పెరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నా.. భారతీయ బిలియనీర్లు మాత్రం మరింత సంపన్నులయ్యారు. కరోనాను కూడా వారికి అనుకూలంగా మార్చుకొని లాభాలను గడించారు. ఆసియా సంపన్నుడు ముఖేష్ అంబానీ అందరి కంటే ఎక్కువగా సంపాదించాడు. ఆయన కంటే రెట్టింపు స్థాయిలో గౌతమ్ అదానీ సంపద పెరిగింది. టోటల్ ఎస్ఏ, వాబర్గ్ పింకస్ నుంచి పెట్టుబడులు కూడా ఈ మద్యనే రాబట్టిన గౌతమ్ అందానీ ఎయిర్ పోర్ట్, సీ పోర్ట్స్ తో పాటు డేటా సెంటర్లు కోల్‌మైన్లు చేజిక్కించుకుంటూ తన సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. అదానీ టోటల్ గ్యాస్ 96శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 90శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 79శాతం, అదానీ పవర్, పోర్ట్స్ 52శాతం వరకూ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పెరిగాయి.

టెక్స్‌టైల్ బిజినెస్ ఓనర్ కుమారుడైన గౌతమ్.. డైమండ్ బిజినెస్ కోసం 1980ల్లో ముంబై వెళ్లారు. కానీ కొంత కాలానికే గుజరాత్ తిరిగి వెళ్లి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉన్నారు. 1988లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ను స్థాపించారు. 1990ల్లో ముంద్రా పోర్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఏటా 264 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగే ముంద్రా పోర్టు దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ పోర్టుగా నిలిచింది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి అదానీ ప్రవేశించారు. దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ పవర్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. బొగ్గు తవ్వకాల్లోకి సైతం అడుగుపెట్టిన అదానీ.. విదేశాలకు సైతం ఈ వ్యాపారాన్ని విస్తరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement