Sunday, April 28, 2024

Breaking: పొట్టలో రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకెళ్తూ… పట్టుబడిన మహిళ

రూ.9కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను పొట్ట‌లో త‌ర‌లిస్తూ ఓ మ‌హిళ ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. డ్రగ్స్ అక్రమంగా తరలిస్తూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విదేశీ మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది. కొకైన్​ను క్యాప్సూళ్లలో నింపి.. పొట్టలో దాచుకొని స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 51 క్యాప్సూళ్లను ఆమె పొట్టలో దాచిపెట్టడంతో అధికారులే ఖంగుతిన్నారు. వీటి విలువ మార్కెట్‌లో రూ.9.11 కోట్లు ఉంటుందని తెలిపారు. ఆఫ్రికాలోని మాళవికి చెందిన ఆ మహిళ… ఇథియోపియా మీదుగా ఢిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement