Sunday, May 19, 2024

పోలీసుని చెప్పుతో చెడా మ‌డా కొట్టిన మ‌హిళ – వైర‌ల్ గా వీడియో

హ‌ద్దు దాటితే పోలీస్ అయినా..సామాన్యుడ‌యినా ఒక‌టేన‌ని నిరూపించిందో మ‌హిళ‌..త‌న‌ని కింద‌కి తోసివేసిన పోలీసుని చెప్పుతో చెడా మ‌డా వాయించేసింది. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. కాగా ఈ సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగింది. చార్ బాగ్ రైల్వే స్టేషన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ లాఠీతో ఒక ప్రయాణికుడు, మహిళను కొట్టాడు. దీంతో వారు ప్రతిఘటించడంతో గొడవ మొదలైంది. కాగా, తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్‌పై ఆ మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో ఆ పోలీస్‌ ఆమెను తోసివేయగా కింద పడింది. పైకి లేచిన ఆ మహిళపై ఆ పోలీస్‌పై పలుమార్లు చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటనను చూసి మిగతా ప్రయాణికులు అక్కడ గుమిగూడారు. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఆ పోలీస్‌ మద్యం సేవించి ఉన్నాడా అని ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఒక మహిళ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు విభిన్నంగా దీనిపై స్పందించారు. పలు ఇమోజీలతో కామెంట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement