Thursday, May 2, 2024

భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ నుండి అప్ డేట్ – ఆనందంలో ప‌వ‌న్ ఫ్యాన్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో ప్ర‌స్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెరకెక్కిస్తోన్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్ర‌స్తుతం షూటింగ్‌ను చివ‌రి ద‌శ‌లో ఉంది. దీని త‌ర్వాత హ‌రిష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్’ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్ర మేక‌ర్స్ విషెస్‌ను తెలుపుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్, హరీష్ శంక‌ర్, న‌వీన్ ఎర్నేని క‌లిసి ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. హరీష్ శంక‌ర్-ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో వ‌చ్చిన ‘గ‌బ్బ‌ర్ సింగ్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ఇక మ‌రోసారి వీళ్ల కాంబో సెట్ అవడంతో ప్రేక్ష‌కుల‌లో ఈ చిత్రంపై భారీ అంచనాలు న‌మోద‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement