Friday, May 17, 2024

వైన్ విక్రయాల విషయంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి హెచ్చరించిన ‘అన్నాహ‌జారే’

సూప‌ర్ మార్కెట్లు, రిటైల్ దుకాణాల్లో వైన్ ని విక్రయించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ నిర్ణ‌యాన్ని ఉప సంహ‌రించుకోవాల‌ని ప్ర‌ముఖ సామాజిక సేవ‌కుడు అన్నా హ‌జారే ఈ నెల 3న లేఖ రాశారు. . వైన్ విక్రయాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని అన్నా హ‌జారే వ్య‌తిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయ‌న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశాను. కానీ, ఎటువంటి స్పందన రాలేద‌న్నారాయ‌న‌. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రానందున, మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు. ’సూపర్ మార్కెట్లు, గ్రోసరీ దుకాణాల్లో వైన్ విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఇది దురదృష్టకరం. రానున్న తరాల వారికి ఇది చేటు చేస్తుంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement