Thursday, May 2, 2024

Weather: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరో 3 రోజుల చలి తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 11 గంటల వరకు చలి ప్రభావం ఉంటుంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తెలంగాణకు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతున్నట్టు వివరించింది. రానున్న రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.

ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  హైదరాబాద్ శివారులోని హయత్ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో 9.7 డిగ్రీలు నమోదైంది. సోమ, మంగళవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలు అవుతున్నా సూర్యుడి జాడ లేకపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంంగా కోస్తాలో చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యంత కనిష్ఠంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement