Thursday, May 9, 2024

Smart Tech | ​ఐఫోన్​ యూజర్లకు వాట్సాప్​లో కొత్త ఫీచర్లు.. ఇకపై మెస్సేజులను ఈజీగా హ్యాండిల్​ చేయొచ్చు!

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్.. ఆపిల్​ ఫోన్లు వాడే iOS యూజర్లకి లేటెస్ట్​ అప్​డేట్​ని తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో పర్సనలైజ్డ్​ అవతార్‌లను సృష్టించి.. వాటిని స్టిక్కర్‌లు, ప్రొఫైల్ పిక్చర్‌లుగా ఉపయోగించుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. ఇక.. కొంతమంది వాట్సాప్​ యూజర్లు అయితే.. ఇప్పటికే ఇట్లాంటి అప్‌డేట్‌ని పొందారు. WABetaInfo తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇప్పుడు మరింత మందికి అందుబాటులోకి వచ్చినట్టు స్పష్టమవుతోంది. యూజర్లు తమ అకౌంట్​లో ఇట్లాంటి ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి WhatsApp సెట్టింగ్‌ని ఓపెన్​ చేసి చెక్​ చేసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా.. ఈ లేటెస్ట్​ అప్‌డేట్‌లో మరో కొత్త ఫీచర్​ని కూడా యూజర్లు పొందవచ్చు. వాట్సాప్ కెమెరాని ఎడమవైపుకు స్వైప్ చేయడం ద్వారా వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేసే ఫీచర్​ని కూడా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ తీసుకొచ్చింది. అంతేకాకుండా తాజా అప్‌డేట్‌లో కొన్ని సెకన్ల పాటు “డిలీట్​ ఫర్​ మీ” అనే ఆప్షన్​ని కూడా చూడొచ్చు.

అయితే.. ఇప్పటికీ ఈ ఫీచర్​ అప్​డేట్​ కాని వారు ముందు ముందు అప్​డేట్స్​ అందుకునే అవకాశం ఉందని వాట్సాప్​ వెల్లడించింది. WhatsApp చాట్‌లు, గ్రూప్స్​లో మెస్సేజ్​లను పిన్ చేయడానికి కూడా కొత్త ఫీచర్​ వచ్చినట్టు తెలుస్తోంది.  యూజర్లు ముఖ్యమైన మెస్సేజ్​లను చాట్‌లో పైభాగానికి పిన్ చేయడానికి పర్మిషన్​ ఇవ్వడం వల్ల ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని WABetaInfo తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement