Wednesday, May 8, 2024

బెంగాల్లో ఐదో విడత పోలింగ్

బంగాల్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్​ ప్రారంభమైంది ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. శనివారం 45 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 342 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశ పోలింగ్​లో అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఈసారి అదనపు బలగాలను మోహరించింది. అధికార తృణమూల్​ కాంగ్రెస్​, బిజెపి మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొంది. 5,789 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఓటింగ్‌ జరగనుంది.

బంగాల్​ ఐదో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. కూచ్‌బిహార్‌ కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలకు బదులు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపి వేసింది. నాలుగో విడతలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోవటంతో ఈసీ అప్రమత్తమైంది. పోలింగ్‌ జరిగే 45 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పోలీసులతోపాటు 853 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది.

బంగాల్​ లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 159 స్థానాలకు ఏప్రిల్​ 17- 29 మధ్యలో పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement