Friday, May 3, 2024

మెరుగైన పోలీసింగ్ తో నేరాలు తగ్గించగలిగాం : ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

మంగళగిరి: ఏపీలో మెరుగైన పోలీపింగ్ తో నేరాల తగ్గించగలిగామ‌ని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా ఫై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయ‌న్నారు. గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021 లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయ‌న్నారు. చోరీల్లో నేరస్తులను గుర్తించడం, రికవరీ శాతం బాగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు 2021లో 19203 జరుగగా.. 2022లో 18739 ప్రమాదాలు జరిగాయ‌న్నారు. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టామ‌న్నారు. లోక్ అదాలత్ తో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారిస్తున్నాం, చిన్నపాటి వివాదాలు, మనస్పర్ధల కారణంగా వివాదాల్లో ఉన్న కేసులలో ఇరువర్గాలను పిలిపించి రాజీ కుదిర్చాం అన్నారు. లోక్ అదాలత్ ద్వారా 1,08,763 కేసులు పరిష్కారం చేశామ‌న్నారు. 66% కేసుల్లో కన్నిన్షన్ చేయించగలిగాం అన్నారు. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము.ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సీపీ,ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు (మహిళలకు సంభందించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు. ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ విధానం ద్వారా కేసుల‌ ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు అన్నారు. అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement