Wednesday, May 1, 2024

రోష‌న్ బ‌ర్త్ డే – నెక్ట్స్ మూవీ అప్ డేట్ – బ‌డా బ్యాన‌ర్

పెళ్లి సంద‌D చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్. ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రం గతేడాది అక్టోబర్ 15న రిలీజ్ అయ్యింది. రూ.8 కోట్ల అంచనా బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ తో ఒకే అనిపించుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు వసూల్ చేసి నిర్మాతను ఖుషీ చేసింది. హీరోయిన్ శ్రీలీలా, రోషన్ కెమి స్ట్రీ ఆడియెన్స్ ను ఎంతగానో మెప్పించాయి అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాతో రోషన్ కు కొంత మైలేజ్ రాగా.. హీరోయిన్ శ్రీలీలాకు మాత్రం మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. డైరెక్టర్ గౌరీ రోనంకి తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో రోషన్ కొంత జోష్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ యంగ్ మరో పెద్ద బ్యానర్ వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యాడు. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 9తో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. చిత్రంలో ప్రధాన నటుడిగా రోషన్ ను ఎంపిక చేసుకుంది. రోషన్ 23వ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement