Friday, April 19, 2024

కేబీఆర్ పార్క్ లో మ‌హిళ‌పై – లైంగిక వేధింపులు

గుర్తు తెలియ‌ని దుండ‌గుడు హైద‌రాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో లైంగిక దాడికి య‌త్నించాడు. వాక్ వేలో నడుస్తున్న సమయంలో ఓ దుండగుడు సదరు మహిళను వెంబడించాడు. కొంత దూరం వెళ్లాక మహిళను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ కేకలు వేయడంతో భర్త అక్కడకు వచ్చాడు. దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనపై భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ‌తంలో కూడా ఇలాగే నటి షాలు చౌరాసియా పై ఓ ఆగంతకుడు లైంగిక దాడికి యత్నించాడు. నిర్మానుష్య ప్రాంతంలో పట్టుకుని లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తి నుంచి చౌరాసియా తప్పించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement