Thursday, May 2, 2024

వైల‌న్స్ వైల‌న్స్ అంటోన్న డేవిడ్ వార్న‌ర్ – ఈ వీడియోకి 5ల‌క్ష‌ల లైక్స్

క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప‌లు చిత్రాల్లోని పాట‌ల‌కి, డైలాగ్స్ ని అనుక‌రిస్తూ చేసిన వీడియోలు బాగా పాపుల‌ర్ అయ్యాయి.
అల వైకుంఠపురములో చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పుల నుంచి అనేక చిత్రాల్లో ఫేమస్ డైలాగ్స్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయ్యాడు డేవిడ్ భాయ్. దీనితో వార్నర్ ఇంస్టాగ్రామ్ లో ఏ చిత్రానికి సంబంధించిన వీడియో చేసినా క్షణాల్లో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా వార్నర్ మరో అద్భుతమైన వీడియోతో అదరగొట్టాడు. ఇటీవల విడుదలైన సంచలనం సృష్టిస్తున్న కేజిఎఫ్ 2 చిత్రంలోని డైలాగ్స్ తో వార్నర్ అదరగొట్టాడు. యష్ చెబుతున్న డైలాగ్స్ కి లిప్ సింక్ ఇచ్చాడు. కేజిఎఫ్ లో బాగా ఫేమస్ అయిన ‘వైలెన్స్ వైలెన్స్’ అనే డైలాగ్స్ చెబుతున్నాడు. ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ యాటిట్యూడ్ విషయంలో యష్ కంటే ఏమాత్రం తగ్గడం లేదు. తాను బ్యాట్ ఝుళిపిస్తున్న విజువల్స్ కూడా ఈ వీడియోలో బాగా సింక్ అయ్యాయి. ఈ వీడియోకి 24 గంటలు ముగియకుండానే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ 2 చిత్రం తెరకెక్కింది. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించేలా హాలీవుడ్ స్థాయిలో రెండవ భాగాన్ని చిత్రీకరించారు. కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్ లో కేక పెట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement