Thursday, May 2, 2024

Viral video: బ‌స్సులో మ‌ద్యం సేవించిన స్కూల్ విద్యార్థులు

త‌మిళ‌నాడులో పాఠ‌శాల విద్యార్థినీ విద్యార్థులు ప్ర‌యాణిస్తున్న ఓ బ‌స్సులో మద్యం సేవిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. చెంగ‌ల్‌ప‌ట్టులోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు కలిసి..ఓ బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి, తాగుతున్నట్లు ఇందులో క‌నిపించింది. ఓ విద్యార్థే దీనిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. మొద‌ట్లో ఇది పాత వీడియో అని అంద‌రూ అనుకున్నారు. కానీ మంగ‌ళ‌వారం రోజే ఇది జ‌రిగింద‌ని ఆ త‌ర్వాత తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement