Saturday, April 27, 2024

నెట్టింట వైర‌ల్ గా మారిన వీడియో-స్వీట్ తినిపించేందుకు కొట్టుకున్న వ‌ధూవ‌రులు

పెళ్లికి సంబంధించి ఆ ప్రాంతం బ‌ట్టి ప‌లు ఆచారాలు ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. కాగా నేపాల్ కి చెందిన ఓ జంట పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో వధూవరులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ వీడియోలో పెళ్లి జరుగుతోంది. వధూవరులు సంప్రదాయ వస్త్రదారణలో కూర్చొని ఉన్నారు. పంతులు చెప్పిన ప్రకారం చేస్తూ ఉన్నారు. వారి సంప్రదాయం ప్రకారం.. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవాలి. ఈ క్రమంలో.. ఎవరికి వారు తామే ముందు తినిపించుకోవాలని ఆరాటపడ్డారు.. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకోవడం వ‌ర‌కు వెళ్లారు.క్లిప్ చివరిలో, భార్య బలవంతంగా అతనికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వరుడు నవ్వుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారు కూడా ఈ జంటను పూర్తి స్థాయిలో గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 70 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ల వర్షం కురుస్తోంది. కొందరు ఈ వీడియోని సరదాగా తీసుకోకోగా.. మరి కొందరు మాత్రం విమర్శించడం గమనార్హం..ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement