Thursday, April 25, 2024

తీరంపై దూసుకొస్తున్న ‘యాస్’.. అల్లకల్లోలంగా సముద్రం

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. యాస్​ తుపాను పారదీప్​కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్ మధ్య బుధవారం మధ్యాహ్నం తీరం దాటనుందని పేర్కొంది. తీరం చేరే సమయంలోనూ యాస్ అతి తీవ్ర తుపాను స్థాయిలోనే ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 165 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

‘యాస్’ తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. . నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుంది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement