Saturday, May 18, 2024

ఆంధ్రోళ్లు తెలంగాణకు అన్యాయం చేయడానికే ఉంటారు: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మహబూబ్ నగర్ పర్యటనలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లంకలో పుట్టినోళ్లు అంతా రాక్షసులనని, ఆంధ్రోళ్లు ఎప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఉంటారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని, తగిన చర్యలు తీసుకుంటారని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ప్రాజెక్టులు కడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటామని అని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement