Thursday, May 9, 2024

వాహనాల‌ తనిఖీ – అక్రమ నాటుసారాయి పట్టివేత

గుత్తి , ప్రభ న్యూస్ : జిల్లా సరిహద్దు గ్రామమైన ఊబిచర్ల గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో నాటు సారా ప‌ట్టుబ‌డింది. సారాని తరలిస్తున్న ద్విచక్ర వాహనంలో వస్తున్న వ్యక్తి ..పోలీసులను చూసి వాహనాన్ని వదిలేసి పారిపోయాడ‌ని సీఐ శ్యామ్ రావు విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ,స్కూటర్ పై నాటుసారాను తరలిస్తున్న వ్యక్తి పోలీసులను చూసి నాటుసారాను, స్కూటర్ ను వదిలేసి పారిపోయారు. నాటు సారా 144 లీటర్లు ఉంటుందని వారు తెలిపారు.వాటిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాసులు,మురహరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement