Friday, May 10, 2024

వర్రకుంట ర‌క్ష‌ణ‌కు ‘ఆంధ్ర‌ప్ర‌భ’ అక్ష‌ర పోరాటం.. క‌దిలిన యంత్రాంగం, ప‌నులు నిలిపివేత

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం బొల్లారం లో ఓ నిర్మాణ కంపెనీ వర్రకుంట ను కబ్జా చేసి విల్లాలను నిర్మిస్తుంటే నిర్మాణ సంస్థ కుట్ర, అధికారులు బాగోతం పై ఉమ్మడి మెదక్ బ్యూరో/ బి ఎం ప్రశాంత్ రెడ్డి 5 రోజుల పాటు అక్ష‌ర ఆయుధంతో వరుస కథనాలు ఆంధ్ర‌ప్ర‌భ‌లో ప్ర‌చురించారు.. దీంతో అధికారుల‌లో క‌ద‌లిక వచ్చింది.. వ‌ర్ర‌కుంట‌ను కాపాడేందుకు ఆంధ్ర ప్రభ పోరాటం విజ‌య‌వంత‌మైంది..

వ‌ర్ర‌కుంట వ‌ద్ద‌కు రెవెన్యూశాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులు చేరుకుని సంయుక్త సర్వే నిర్వ‌హించారు.. వ‌ర్ర‌కుంట క‌బ్జాకు గురైంద‌ని గుర్తించారు.. దీంతో అక్క‌డ విల్లాల నిర్మాణం నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.. ఈ నిర్మాణాలు చేప‌ట్టిన‌ గ్రేటర్ ఇన్​ఫ్రా ప్రాజెక్టుకు లీగల్ నోటీసుల జారీ చేశారు.. దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.. ‘ఆంధ్ర‌ప‌భ’ చొర‌వ‌తో తిరిగి వ‌ర్ర‌కుంట తిరిగి తన ఉనికిని దక్కించుకోనుంది. దీంతో ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ అక్షర పోరాటాన్ని కొనియాడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement