Sunday, April 28, 2024

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ బ‌ర్త్ డే – ‘య‌శోద’ నుండి పోస్టర్ రిలీజ్

త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ తెలుగులో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. ‘క్రాక్ చిత్రం హిట్ అయిన దగ్గర నుంచి ఆమె జోరు మరింతగా పెరిగినట్టుగా కనిపిస్తోంది. సమంత ప్రధాన పాత్రను పోషిస్తున్న ‘యశోద’ సినిమాలో వరలక్ష్మి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టీమ్ విషెస్ చెబుతూ ఆమె స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె ‘మధుబాల’ అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెప్పారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ ‘హనుమాన్’ .. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలోను చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement