Thursday, April 25, 2024

vande bharat: వందేభారత్ రైలుతో.. పెరగ‌నున్న‌ టూరిజం, ఉపాధి అవకాశాలు : ప్ర‌ధాని మోడీ

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ ఈశాన్య ప్రాంతంలో పర్యాటకం, విద్య, వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంచుతుందని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోడీ వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-జల్పాయిగురి మధ్య పరుగులు పెట్టనుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు అస్సాంతో సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాల రైలు కనెక్టివిటీకి ఒక పెద్ద రోజు అన్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ నివసించే ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తుందన్నారు. ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా ఊపునిస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అనుసంధానానికి సంబంధించిన మూడు పనులు జరుగుతున్నాయి. ఈశాన్య భారతదేశం మొదటి వందే భారత్‌ను పొందుతోందన్నారు. పశ్చిమ బెంగాల్‌ను కలుపుతూ ఇది మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అన్నారు. అస్సాం, మేఘాలయలో సుమారు 425 కి.మీ ట్రాక్‌పై విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement