Saturday, April 27, 2024

వైష్ణోదేవి ఆలయానికి అందిన విరాళం

భారత దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శ్రీ వైష్ణో దేవి ఆలయం ఒకటి.  జమ్ములోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి భక్తుల నుంచి పెద్ద సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. గత 20 ఏళ్లలో ఏకంగా 1,800 కేజీల బంగారం, 4,700 కేజీల వెండితో పాటు రూ. 2 వేల కోట్ల నగదు విరాళం రూపంలో అందింది. 2000 నుంచి 2020 మధ్య కాలంలో ఈ విరాళాలు వచ్చాయి. హేమంత్ గౌనియా అనే సామాజిక కార్యకర్త పెట్టుకున్న అర్జీపై ఆర్టీఐ వివరాలు వెల్లడించారు.


గత కొన్నేళ్లుగా ఆలయానికి విరాళాల రూపంలో ఏం వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నానని హేమంత్ తెలిపారు. ప్రతి ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని… అయినప్పటికీ విరాళాలు ఇంత ఎక్కువగా వచ్చాయనే విషయాన్ని తాను ఊహించలేకపోయానని చెప్పారు. 2000లో ఈ దేవాలయాన్ని 50 లక్షల మంది భక్తులు సందర్శించారు. 2011-12 మధ్య కోటి మంది వచ్చినట్లు అంచనా. 2018-19లలో ఈ సంఖ్య 80 లక్షలకు చేరుకుంది. అయితే కరోనా కారణంగా 2020లో ఈ సంఖ్య 17 లక్షల మంది సందర్శించారు.

కాగా, ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు కష్టతరమైన ట్రెక్కింగ్ ను చేసుకుంటూ వెళతారు. ఈ ఆలయాన్ని ప్రతి ఏటా దాదాపు కోటి మంది వరకూ భక్తులు సందర్శిస్తారని నివేదికలు చెబుతున్నాయి. వేసవి కాలంలో ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునేందుకు అనేక మంది పర్యాటకులు తమ పిల్లలు, బంధువులతో కలిసి కుటుంబ సమేతంగా ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటుంటారు. దీంతో ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. ఇది వరకు వైష్ణో దేవికి వెళ్లాలనుకునే పర్యాటకులు జమ్మూ & కాశ్మీర్ నుండి కత్రా వరకూ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు ఐ‌ఆర్‌సి‌టి‌సి చొరవతో కత్రాకు నేరుగా రైళ్లు నడుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement