Saturday, May 18, 2024

మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసన

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాసన మెగా ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలిగా.. అపోలో ఫాండేషన్ వైస్ చైర్​పర్సన్​గా.. బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఉపాసన. మెడికల్ ఫీల్డ్ లో.. తనదైన మార్గంలో సేవచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన. ఎన్నో మెడికల్ క్యాంపులు, వైద్య సేవలు చేయించి.. మరెన్నో సేవా కార్యక్రమాల ద్వార ఆమె గుర్తింపు పొందారు. ఉపాసన చేసిన సేవలకు గుర్తింపుగా ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు మెగా కోడలు. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసన చోటు దక్కించుకున్నారు. పాసన చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం లభించిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు మెగా కోడలు. ఇక ఉపాసన సాధించిన ఈ అరుదైన ఘనత గురించి తెలిసి మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే ఉపాసన ఆరోనెల ప్రెగ్నెంట్ ఉండటం.. అటు రామ్ చరణ్ ఆస్కార్ విజయం.. సంబరాలలో మునిగితేలుతున్న మెగా ఫ్యామిలీకి..మెగా ఫ్యాన్స్ కు ఈ న్యూస్ మరింత బూస్ట్ ఇచ్చింది. దాంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాలను అంటుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement