Friday, April 26, 2024

Heart Attack | పెళ్లి సంబురాల్లో విషాదం.. డ్యాన్స్​ చేస్తూనే కుప్పకూలిన వ్యక్తి!

పెళ్లి సంబురాల్లో అంతా ఉన్నారు. కొంతమంది డ్యాన్స్​ చేస్తూ హంగామా చేస్తున్నారు. అయితే ఓ 40 ఏళ్ల వ్యక్తి ఉత్సాహంతో స్టెప్పులేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ అయ్యో ఏమైందంటూ ఉరుకులు, పరుగుల మీద వచ్చి చూశారు. అయితే.. అప్పటికే అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది.

ఓ పెళ్లి కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ 40 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు.. అయితే ఆ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మనోజ్ విశ్వకర్మ అనే వ్యక్తి పిల్పాని కత్రా సమీపంలో ఒక వివాహ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్​ చేశాడు. ఆ ఉత్సాహంలో ఉండగానే అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు..

ఇక.. గత నెలలో ఇదే తరహాలో దాహోద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో డ్యాన్స్​  చేస్తూ 51 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. కాగా, యువతలోనూ గుండెపోటు ఇప్పుడు సర్వసాధారణంగా మారిందని, ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ శుక్లా, గాయకుడు కెకెతో పాటు చాలామంది యువ కళాకారులు గుండెపోటుతో చనిపోయిన విషయాన్ని డాక్టర్లు గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement