Friday, January 27, 2023

తెలంగాణ‌లో కొలువుల జాత‌ర‌.. మ‌రో 16,940 పోస్టుల‌కు డిసెంబ‌ర్‌లో నోటిఫికేష‌న్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉద్యోగ ఖాళీలు, భ‌ర్తీల‌పై వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు, టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌తో స‌మీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 60,929 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని సీఎస్ తెలిపారు.

- Advertisement -
   

మ‌రో 16,940 పోస్టుల‌కు మూడు రోజుల్లో అనుమ‌తులు వ‌స్తాయ‌న్నారు. ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ వేగంగా పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. అధికారులు గ‌డువులు నిర్దేశించుకొని ప‌ని చేయాల‌ని సూచించారు. వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్లు ఇచ్చేలా వివ‌రాలు అందించాల‌ని ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను సీఎస్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement