Saturday, December 7, 2024

ఆడంభ‌రాలకి దూరంగా.. నిర్మ‌లా సీతారామ‌న్ కుమారై వివాహం

ఆడంభ‌రాల‌కి..భారీ ఖ‌ర్చు..అతిర‌థ‌మ‌హార‌థులు..రాజ‌కీయ ప్ర‌ముఖులు..ఆర్భాటాల‌కి దూరంగా అత్యంత సింపుల్ గా కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కుమారై వివాహం జ‌ర‌గ‌డం విశేషం. వారి ఇంట్లోనే కొంతమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక నిర్వహించారు. బెంగళూరులో కుటుంబం, స్నేహితులతో ఒక సాధారణ వేడుకలా పెళ్లి నిరాడంబంరంగా జరిగిపోయింది. పెళ్లికి రాజకీయ ప్రముఖులెవరూ హాజరుకాక‌పోవ‌డం విశేషం. నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ప్రతీక్‌తో బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఉడిపి ఆడమారు మఠం సీర్లు వధూవరులను ఆశీర్వదించారు. వధువు ఈ ప్రత్యేక సందర్భం కోసం గులాబీ రంగు చీర, ఆకుపచ్చ బ్లౌజ్‌వేసుకుంది. వరుడు తెల్లటి పంచె, శాలువా ధరించాడు.వధువు తల్లి శ్రీమతి సీతారామన్ మొలకాల్మూరు చీర కట్టుకున్నారు. అడమారు మఠం వైదిక క్రమంలో వివాహం జరిగింది.కేంద్ర ఆర్థిక‌మంత్రి అంటే మాటాలా..ఆమె త‌ల‌చుకుంటే అంగ‌రంగ‌వైభ‌వంగా ఈ పెళ్లిని జ‌రిపించేవారు. కానీ అన్నింటికీ విరుద్ధంగా ఇంత సింపుల్ గా పెళ్లి జ‌రిపించ‌డంతో ఇప్పుడు అంతా ఈ విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. నిర్మ‌లా సీతారామ్ పిలిస్తే సాక్షాత్త్ ప్ర‌ధాని మోడీ కూడా ఈ పెళ్లి వ‌చ్చేవారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement