Sunday, April 28, 2024

Weather Alert: రెండు, మూడు రోజులు భగభగలే.. ఆరెంజ్​ అలర్ట్​ ప్రకటించిన ఐఎండీ

తెలంగాణలో మే 2వ తేదీ దాకా ఎండలు దంచికొడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈమేరకు  ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు ఇవ్వాల ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 42°C – 47°C వరకు నమోదయ్యే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో ఐఎండీ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

IMD వాతావరణ హెచ్చరికల కోసం నాలుగు రంగు కోడ్‌లను ఉపయోగిస్తుంది. ఆకుపచ్చ అంటే ఎటువంటి చర్య అవసరం లేదు. పసుపు కాస్త జాగ్రత్తగా ఉండాలని, అప్‌డేట్‌గా ఉండడాన్ని సూచిస్తుంది. ఇక ఆరెంజ్ అంటే అన్ని ఏర్పాట్లతో జాగ్రత్తగా ఉండాలని ముఖ్య గమనిక.. రెడ్ అలర్ట్ అంటే సీరియస్​ పరిస్థితులుంటాయి.. వేగవంతమైన చర్య తీసుకోండి అని అర్థం. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కొమరంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో మే 2 వరకు హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయి. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement