Wednesday, April 24, 2024

ట్విట్టర్​ కార్యాలయం మూసివేత..

అమెరికాలోని ట్విట్టర్​ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది. అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​​ అల్టిమేటంతో.. ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేయడమే ఇందుకు కారణం. రోజుకో వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది ట్విట్టర్​. తాజాగా.. ట్విట్టర్​ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమెరికాలోని ట్విట్టర్​ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. త‌క్ష‌ణ‌మే మూసివేత మొద‌లైన‌ట్లు కూడా ఆ సంస్థ చెప్పింది.

మ‌ళ్లీ ఆఫీసు కార్యాల‌యాల‌ను న‌వంబ‌ర్ 21వ తేదీ నుంచి తెరువ‌నున్న‌ట్లు ఉద్యోగుల‌కు స‌మాచారం చేర‌వేసిన‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయాల‌ని కొత్త ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ పిలుపు ఇచ్చిన నేప‌థ్యంలో ఆ కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థ‌ను వీడుతున్నారు. వంద‌ల సంఖ్య‌లో ఉద్యోగులు రిజైన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మస్క్​ అల్టిమేటం నేప‌థ్యంలో ఉద్యోగుల రాజీనామాలు చేస్తుండ‌డంతో ట్విట్ట‌ర్ కార్యాల‌యం తాత్కాలికంగా మూసివేసిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement