Sunday, December 4, 2022

అన్నమయ్య కీర్తనలు : ఏ పురాణముల

రాగం : గౌరీ మనోహరి
ఏపురాణముల నెంత వెదకినా
శ్రీ పతిదాసులు చెడ రెన్నడును

హరివిరహితములు అవిగొన్నాళ్లకు
విరసంబులు మరి విఫలములు
నరహరి గొలిచిటు నమ్మినవరములు
నిరతము లెన్నడు నెలవులు చెడవు

- Advertisement -
   

కమలాక్షుని మతి గాననిచదువులు
కుమతంబులు బహు కుపథములు
జనుళి నచ్యుతుని సమారాధనలు
విమలములేకాని వితథముగావు

శ్రీ వల్లభుగతి జేరనిపదవులు
దావతులు కపట ధర్మములు
శ్రీ వేంకటపతి సేవించు సేవలు
పావనము లధికభాగ్యపు సిరులు

Advertisement

తాజా వార్తలు

Advertisement