Saturday, November 26, 2022

ఈడీ కార్యాలయంలో అస్వస్థతకి గురైన ఎల్.రమణ.. యశోద ఆసుపత్రికి తరలింపు

నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ.ఈ విచారణ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఈడీ కార్యాలయంలో కలకలం రేగింది. ఆయనని వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా రమణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు, ఎల్.రమణను ఈడీ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. తాను నేపాల్ బిగ్ డాడీ ఈవెంట్ కు వెళ్లలేదని ఎల్.రమణ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం.

- Advertisement -
   

ఎల్.రమణకు ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగింది. ఈడీ విచారణలో ఆయన అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విచారణ కోస ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన లిఫ్టు ద్వారా కాకుండా మెట్లు ఎక్కి మూడో అంతస్తుకు వెళ్లారు. విచారణ సమయంలో అక్కడి సిబ్బందిని మంచినీళ్లు అడిగారు. ఆపై కాసేపటికే అస్వస్థతకు గురయినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement