Thursday, May 2, 2024

TSRTC: బ‌స్ ఛార్జీలు పెంచుతున్నట్లు స‌జ్జ‌నార్ వెల్లడి

టిఎస్ ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కి షాక్.. ప‌లు బ‌స్సుల రేట్లు పెరిగాయి. మ‌రి ఏ బ‌స్సుకి ఎంతెంత రేట్లు పెరిగాయో చూద్దాం .. ప‌ల్లె వెలుగుకు 25పైస‌లు.. ఎక్స్ ప్రెస్ లు ..ఇత‌ర స‌ర్వీసుల‌కు 30పైస‌లు పెంచాల‌ని ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసింది..ఈ మేర‌కు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రతిపాదనలు పంపామని.. త్వరలోనే.. ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. 9,750 బస్సులను ఆర్టీసీ 3,080 రూట్లను నడిపిస్తున్నామని…రోజు 33 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ.. 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతిరోజు తరలిస్తున్నామన్నారు. గతంలో 20 పైసలు అన్ని బస్సులకు పెంచారని .. ఆ డబ్బులు ఆర్టీసీకి చేరలేదన్నారు. మార్చి నుండి కరోనా.. తరువాత వచ్చిన సెకండ్ వేవ్ వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంద‌న్నారు.

కరోనా సమయంలో 251 మంది ఆర్టీసీ సిబ్బంది బస్సులు నడపడం వల్ల మరణించారన్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగాయ‌ని వెల్ల‌డించారు.. రూ. 63.8 డీజిల్ ఉండేది..ఇప్పుడు 87 రూపాయలు ఉంది..27 రూపాయలు అధికంగా పెరిగిందని గుర్తు చేశారు. స్పేర్ పార్ట్స్ కూడా భారీగా పెరిగాయి..ఈ సంవత్సరం రూ. 1400 కోట్లు ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు నష్టం వచ్చిందన్నారు. పల్లె వెలుగు, ఆర్డినరికి 25 పైసలు.. రాజధాని ,ఎక్స్ ప్రెస్,గరుడ సర్వీసులకులకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదనలు పెట్టామని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement