Saturday, April 27, 2024

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మదు మిస్సింగ్!

టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కుడున్నారనే విషయంపై ఎవరికీ అంతు పట్టడం లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన అదృశ్యం కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈటలకు సన్నిహితుడిగా పేరున్న పుట్ట మధు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకొని ఎందుకు కనిపించకుండా పోయారనేది హాట్‌ టాపిక్‌ అయింది.

పుట్ట మధు సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. ఆయన అదృశ్యంపై కుటుంబ సభ్యులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఆయన ఆచూకీపై పోలీసులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు పెట్టిన మీడియా సమావేశానికి కూడా రాలేదు. మంథని నుంచి గన్‌ మెన్లకు కూడా చెప్పకుండా మధు అదృశ్యం అయినట్లు మంథనిలో ప్రచారం జరుగుతోంది.

అయితే, ఆయన మహారాష్ట్రలోని రాయపూర్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కర్ణాటక వెళ్లినట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బుధవారం రాత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కూడా కలిశారని కొంత మంది అంటున్నారు. అయితే. ఈ వార్తలేవీ నిర్ధారణ కావడం లేదు. పుట్ట మధు గురువారం సాయంత్రం బయటకు వస్తారని కూడా అంటున్నారు. మాజీ మంత్రి ఈటెలకు వ్యతిరేకంగా ఆయన మిగతా టీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడుతారని అంటున్నారు. అయితే, ఈ విషయం కూడా నిర్ధారణ కావడం లేదు.

పెద్దపల్లిలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య జరిగిన సమయంలో పుట్ట మధుపై కూడా విమర్శలు వచ్చాయి. లాయర్ వామన్‌రావు, నాగమణి హత్య కోసం రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అదే సమయంలో ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తెరపైకి రాగా.. అనూహ్యంగా మధు అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన ఫోన్‌లోనూ అందుబాటులో లేరు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement