Saturday, April 20, 2024

అన్నమయ్య సంకీర్తనలు

నగవులు నిజమని

నగవులు నిజమని నమ్మేదా
వొగి నడియాసలు వొద్దనవే || || నగవులు నిజమని||

తొల్లిటికర్మము దొంతుల నుండగ
చెల్లబోయిక చేసేదా
యెల్లలోకములు యేలేటి దేవుడా
వొల్లనొల్ల నిక వొద్దనవే || || నగవులు నిజమని||

పోయిన జన్మము పొరుగుల నుండగ
ఛీయనక యుందు చెలగేదా
వేయినామముల వెన్నుడ మాయలు
వోయయ్య యిక వొద్దనవే || || నగవులు నిజమని||

నలి నీ నామము నాలికనుండగ
తలకొని యితరము తడవేదా
బలు శ్రీ వేంకటపతి నిన్ను గిలిచి
వొలుకు చెంచలము లొద్దనవే || || నగవులు నిజమని||

Advertisement

తాజా వార్తలు

Advertisement