Monday, April 29, 2024

అది ఫేక్ మెసేజ్ – మ‌న్మోహ‌న్ సింగ్ ఆరోగ్యంగా ఉండాలి – మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీ …మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌ను షేర్ చేయడంతో వివాదం చెలరేగింది.దాంతో ఆ మెసేజ్ లు ఫేక్ ఎకౌంట్ నుండి పెట్టార‌ని గుర్తించిన కొద్దిసేపటికే ఛటర్జీ తన ఫేస్‌బుక్ వాల్ నుండి వాటిని తొలగించారు. మాజీ ప్రధాని మరణం గురించి ఛటర్జీ సోషల్ మీడియాలో నకిలీ సందేశాన్ని అప్‌లోడ్ చేయడంతో కలకలం మొదలైంది. అప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధి ఛటర్జీ పేరు చెప్పకుండా ఆయనపై తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. ఈ వివాదంపై ఘోష్ తన ఫేస్‌బుక్ పేజీలో స్పందించారు.. ఆయన మరణానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తులను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు పార్థ ఛ‌ట‌ర్జీ. అదే తప్పుడు సమాచారాన్ని పంచుకోవడం .. దానిని మరింత వ్యాప్తి చేయడం ద్వారా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిని కూడా విమర్శించారు. ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను’ అని ఘోష్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement