Thursday, May 16, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,750గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 ఎగిసి రూ.51 వేలుగా రికార్డయింది. వెండి రేట్లు సైతం మార్కెట్లలో కొనుగోలుదారులకు షాకిస్తూ కొండెక్కుతున్నాయి. కేజీ వెండి రేటు నేడు రూ.800 పెరిగి రూ.60 వేల పైన రూ.60,300గా నమోదైంది. ఈ వారంలో అన్ని రోజులు దాదాపు బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అక్కడ కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ధర రూ,100 మేర పెరిగి రూ.46,900గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 ఎగిసి రూ.51,150గా ఉంది. అలాగే సిల్వర్ రేటు సైతం రూ.800 పెరిగి రూ.55 వేలకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement