Sunday, May 19, 2024

తగ్గిన బంగారం ధర..పెరిగిన వెండి

నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పండగ వేళ బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్. భారతీయులకు ధన్‌తేరాస్, దీపావళి వేళ గోల్డ్ కొనడం అలవాటే. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.130 పెరిగి 46 వేల 550 రూపాయలకు చేరింది. అంతకుముందు రోజు 40 రూపాయలు తగ్గింది. అక్టోబర్ 10న తులం గోల్డ్ రేటు రూ.47,600 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.46,550 వద్ద ఉంది. అంటే 10 రోజుల్లో రూ.1000 మేర పతనమైంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.140 చొప్పున పెరిగి తులం రూ.50,780 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే అక్టోబర్ 10-15 మధ్య రూ.6000కుపైగా పతనమైన ధర అక్టోబర్ 18న రూ.1300 మేర పెరిగింది. మళ్లీ ఇవాళ 300 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.61,500 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement