Thursday, April 25, 2024

సీఎం మమతాబెనర్జీకి.. బాంబే హైకోర్టులో చుక్కెదురు

బాంబే హైకోర్టు లో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ గీతాన్ని అవమానపరిచారంటూ తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేవేయాలంటూ సీఎం మమత దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలో సెషన్‌ కోర్టు మమతకు సమన్లు జారీ చేయగా.. దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపించారు. మమతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి, ఇందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. జనవరి 2023 నాటి సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన సింగిల్ బెంచ్ కొట్టివేసింది.

సమన్‌ల జారీపై విచారణ కోసం మేజిస్ట్రేట్ కోర్టుకు తిరిగి కేసును పంపుతుంది.స్థానిక బీజేపీ అధికారి వివేకానంద్ గుప్తా ఫిర్యాదు మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2022 మార్చిలో మమతా బెనర్జీకి సమన్లు ​​జారీ చేసింది. 2021 డిసెంబర్‌లో యశ్వంతరావు చవాన్ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపించినప్పుడు కూడా మమతా బెనర్జీ కూర్చొని ఉన్నారని, మధ్యలో అకస్మాత్తుగా లేచి రెండు లైన్లు పాడి అకస్మాత్తుగా సైలెంట్ అయ్యారని, అక్కడి నుంచి వెళ్లిపోయారని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై జారీ చేసిన సమన్లను సీఎం మమత ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో సవాల్ చేశారు. జనవరి 2023లో ప్రత్యేక న్యాయమూర్తి RN రోకడే విధానపరమైన కారణాలతో సమన్లను పక్కన పెట్టారు. దీంతో పాటు గుప్తా ఫిర్యాదును మరోసారి పరిశీలించాలని మేజిస్ట్రేట్‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement