Monday, May 6, 2024

కోల్‌క‌తాలో టీఎంసీ హ‌వా.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ !

దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వీస్తున్న ఎదురుగాలి తృణ‌మూల్‌కు క‌లిసివ‌చ్చిన‌ట్లైంది. కోల్ క‌తా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన‌ ఫ‌లితాలు తృణ‌మూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌స్తున్నాయి. 144 వార్డులున్న కోల్‌క‌తా కార్పొరేష‌న్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజ‌యం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ కేవ‌లం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్న‌ది. కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు త‌లా రెండు చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతున్నాయి. ఇండిపెండెంట్లు మూడు చోట్ల లీడింగ్‌లో కొన‌సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, కోల్‌క‌తా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మాత్రం రాణించ‌లేక‌పోయింది. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కోల్‌క‌తాలో త‌న పట్టును మ‌రోసారి నిల‌బెట్టుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement